నూతన సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవం మరియు బీసీ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం లో పాల్గొన్న ఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డి
నారాయణఖేడ్ నియోజకవర్గం_
నగల్ గిద్ద మండల పరిధిలోని కరముంగి గ్రామం లో ఈరోజు నూతన సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవం మరియు బీసీ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం లో పాల్గొన్న నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డి పాల్గొని అనంతరం గ్రామం లోని నూతనంగా ఏర్పాటుచేసిన నర్సరీనీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి గ్రామాలలోని రోడ్లను అద్వానంగా తయారుచేశారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం చిన్నచిన్న గుంతలను కూడా పూడిక చేయలేరు కావున మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాలకు రోడ్లను మరియు గ్రామాలలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ పథకం ద్వారా ఇందిరమ్మ ఇండ్లను అందించే గొప్ప కార్యక్రమం మా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని ఎమ్మెల్యే అన్నార
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు గుండె రావు పాటిల్,విఠల్ రావు పాటిల్,అనిల్ పాటిల్, మాజీ సర్పంచ్లు,శ్రీకాంత్ పిఎసిఎస్ ఛైర్మెన్,మరియు మండల అధికారులు మరియు కరముంగీ గ్రామ ప్రజలకు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు