ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు రూ.40 లక్షలు పరికరాలు సమకూర్చనున్న కియా

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు రూ.40 లక్షలు పరికరాలు సమకూర్చనున్న కియా

-కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీం కింద కుదిరిన ఎంవోయూ

– *ఆర్థిక* *శాఖ* *మంత్రి* *పయ్యావుల* *కేశవ్* *కి* *కృతజ్ఞతలు* *తెలిపిన* *ప్రిన్సిపాల్*

ఎంవోయు పత్రాలను మార్చుకొంటున్న పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ కె.అశ్రఫ్ అలీ, కియా కంపెనీ ప్రతినిధి

రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక చొరవతో మండల పరిధిలోని చిన్నముష్టూరు గ్రామంలోగల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు పెనుగొండ అయ్యవారిపల్లివద్ద గల కియా ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీం కింద 40 లక్షల రూపాయలు విలువగల ప్రయోగశాల పరికరాలు, యంత్రాలను సమకూర్చనుంది. గురువారం కంపెనీలో జరిగిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె. ఆశ్రఫ్ అలీ కియా ఇండియా కంపెనీ ప్రతినిధులతో కంపెనీ ఉన్నత సలహాదారుడు యోన్గిల్ మా, సి.ఎస్.ఆర్ అధికార ప్రతినిధులు జి.రవిశంకర్రెడ్డి, పి. వీరేంద్ర సమక్షంలో ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కె. ఆశ్రఫ్ అలీ, ట్రిపుల్ ఇఇఇ విభాగాధిపతి వై.సురేష్బాబు, జనరల్ సెక్షన్ శాఖాధిపతి వి. నరసింహారెడ్డి తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక చొరవతో పాలిటెక్నిక్ కళాశాలకు విలువైన ప్రయోగశాల పరికరాలు, యంత్రాలు సమకూరనున్నాయని మంత్రితోపాటు కియా ఇండియా కంపెనీకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment