Site icon PRASHNA AYUDHAM

కిడ్నీ రాకెట్‌.. ఆసుపత్రి సీజ్‌

IMG 20250121 WA0110

*హైదరాబాద్‌లో కిడ్నీ రాకెట్‌.. ఆసుపత్రి సీజ్‌*

*Jan 21, 2025*

హైదరాబాద్‌లో కిడ్నీ రాకెట్‌.. ఆసుపత్రి సీజ్‌

హైదరాబాద్ సరూర్‌నగర్‌ డివిజన్‌లోని అలకనంద మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్ వ్యవహారం కలకలం రేపింది. అనుమతి లేకుండా ఆసుపత్రి నిర్వహణ, కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తమిళనాడుకు చెందిన ఇద్దరు, కర్ణాటకకు చెందిన ఇద్దరికి కిడ్నీ మార్పిడి చికిత్సలు జరిగినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిని సీజ్‌ చేసి, ఎండీ సుమంత్ చారీ, ఆసుపత్రి సిబ్బందిని అరెస్ట్ చేశారు.

Exit mobile version