తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో ‘కిడ్స్ విత్ ఖాఖీ’ కార్యక్రమం
కామారెడ్డి జిల్లా తాడ్వాయి
(ప్రశ్న ఆయుధం) నవంబర్ 14
బాలల దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ, ఏఎస్పీ ఆదేశాల మేరకు తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేకంగా ‘కిడ్స్ విత్ ఖాఖీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా SPR స్కూల్‌కు చెందిన 11 మంది విద్యార్థులు పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు.
విజిట్ సమయంలో పోలీసు సిబ్బంది చేసే విధులు, స్టేషన్‌లో కేసులు ఎలా నమోదవుతాయి, దర్యాప్తు ఎలా జరుగుతుంది, ప్రజా–పోలీస్ సంబంధాల ప్రాముఖ్యత వంటి అంశాలను అధికారులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. అలాగే వివిధ ఆక్టివిటీల ద్వారా పోలీస్ వ్యవస్థపై అవగాహన కల్పించారు.