సంగారెడ్డి/పటాన్ చెరు, జూలై 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్‌చెరు జీహెచ్ఎంసీ డివిజన్ పరిధిలోని ప్రణీత్ ప్రణవ్ నైట్‌వుడ్స్‌లో ఏర్పాటు చేసిన హైపర్ మార్ట్ ను ఎండీఆర్ ఫౌండేషన్ ఫౌండర్, పటాన్‌చెరు మాజీ సర్పంచ్ మాదిరి దేవేందర్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవేందర్ రాజు మాట్లాడుతూ.. షాపింగ్‌కి అన్ని విభాగాల్లో నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులో ఉంచిన ఈ హైపర్‌మార్ట్ ద్వారా ఏర్పాటు చేయబడిన ఒక మంచి వాణిజ్య వేదిక అని అన్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే దీని లక్ష్యం” అని తెలిపారు. అధ్విక్ హైపర్ మార్ట్ యాజమాన్యానికి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ఎండీఆర్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
పటాన్‌చెరులో అధ్విక్ హైపర్ మార్ట్ ను ప్రారంభించిన మాదిరి దేవేందర్ రాజు
Published On: July 28, 2025 5:03 pm