జాతీయ జెండాను ఆవిష్కరించిన పులిమామిడి రాజు

సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 26 (ప్రశ్న ఆయుధం న్యూస్): సదాశివపేట పట్టణంలోని 12 వ వార్డులో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి జనగణమనను ఆలపించారు. అనంతరం జాతీయ నాయకులందరిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ.. ఈ రోజు భారత దేశానికి పెద్ద జాతీయ పండుగ, ఇక స్వాతంత్రం వచ్చాక కూడా బ్రిటిష్ చట్టాలే అమలులో ఉండేవని, దానికి మన రాజ్యాంగ రచయిత డా. బి ఆర్. అంబేద్కర్ నాయకత్వంలో డా.బాబు రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో 1950 జనవరి 26న రాజ్యాంగాన్ని రచించడం జరిగిందన్నారు. ఈ రాజ్యాంగానికి 2సం. 11నెలల 18 రోజులు ఎంతో కస్టపడి వివిధ దేశాల్లోని మంచి మంచి సంస్కరణలను తీసుకొని దీనిని రాయడం జరిగిందని తెలిపారు. జనవరి 26, 1950 వలన భారతదేశం స్వయం సంపత్తి దేశంగా విద్యా, వైద్యం అభివృద్ధి చెందడానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలులోకి వచ్చిందని, కాబట్టి మనం ఖచ్చితంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉషాకిరణ్, పి.ఎం.ఆర్. యువసేన సభ్యులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now