Site icon PRASHNA AYUDHAM

కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం : రాజు యాదవ్

WhatsApp Image 2025 02 24 at 5.39.34 PM
గజ్వేల్ నియోజకవర్గం, 24 ఫిబ్రవరి 2025 : కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని రాజు యాదవ్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అక్కారం గ్రామం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజు యాదవ్ సోమవారం గజ్వేల్ లో మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పాలన  కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజా పాలన విజయవంతంగా కొనసాగుతుందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారని, త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని అలాగే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బిజెపి, బిఆర్ఎస్ మాటలకే పరిమితమైన పార్టీలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలు విడతల వారీగా అమలు చేస్తున్నారని, ఉచిత బస్సు ద్వారా మహిళలు సంతోషంగా ఉన్నారని, రైతు రుణ మాఫీతో రైతులు సంతోషంగా ఉన్నారని, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనతో యువకులు సంతోషంగా ఉన్నారన్నారు.
Exit mobile version