భువనగిరి పార్లేమెంట్ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఇలా ఫ్లెక్సీలు చింపడం సిగ్గు చేటు. జనగామలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో NSUI జనగామ జిల్లా అధ్యక్షులు చిలువేరు అభి గౌడ్ మరియు బి.సి సెల్ జనగామ జిల్లా అధ్యక్షులు లోక్కుంట్ల ప్రవీణ్ మాట్లాడుతూ రాజకీయ వ్యవస్థ అంటే పది మందికి సహాయపడేలా ఉండాలి కానీ ఇతరులని నాశనం చేసేలా కాదన్నారు. మీకు చాతనైతే ప్రజల ప్రేమ, ఆదరాభిమానాలు పొందేలా పని చేసి పార్టీ ప్రతిష్టని పెంచాలి కానీ ఇలా పార్టీ ని నాశనం చేసేలా ఉండకూడదని కోరుతున్నాం అన్నారు. ఇలా చేయడం పార్టీ విధి విధానాలు కాదని తెలుపుతున్నాం అన్నారు. ఇంకొకసారి మళ్ళీ ఇదే విధంగా ఎంపీ ఫ్లెక్స్ లని చింపే ప్రయత్నం చేస్తే ఉరుకోబమని హెచ్చరిస్తున్నాం అన్నారు. ఇలా దొంగ తనంగా రాత్రి పూట ఫ్లెక్స్ లు చింపడం మీ నాయకుడు మీకు నేర్పిన పద్దతి అయితే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం అన్నారు. కొన్ని రోజుల క్రితం హనుమండ్ల ఝాన్సీ రెడ్డి పుట్టిన రోజు వేడుకలకు కూడా ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ లని కూడా ఇదే విధంగా చింపి మీ నీచ బుద్ధిని చూపించుకున్నారు.కాంగ్రేస్ పార్టీ సిద్ధాంతాలని, విధి విధానాలని కాపాడడం ప్రతి కాంగ్రేస్ పార్టీ కార్యకర్త బాధ్యత అన్నారు, మేము కూడా కాంగ్రేస్ పార్టీ కార్యకర్తలుగా మా బాధ్యత కూడా అని తెలుపుతున్నాం అన్నారు. ఇంతటి నీచ స్థాయికి దిగజారిన మీకు తగిన శాస్తి జరుగుతుందని తెలుపుతున్నాం అన్నారు…
Latest News
