*జనప్రియ అపార్ట్మెంట్లో జనరల్ సెక్రెటరీగా స్థానం దక్కించుకున్న కిరణ్*
*ప్రశ్న ఆయుధం,జులై 01, శేరిలింగంపల్లి,ప్రతినిధి*
నాకు అప్పగించిన బాధ్యత పూర్తిగా నిర్వహిస్తాను.. వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించండి. జనరల్ సెక్రెటరీ జి.కిరణ్. హైదరాబాదులోని శేర్లింగంపల్లి జై గణేశ భక్త సమితి జనరల్ సెక్రటరీ గా మియాపూర్ అంబేద్కర్ నగర్ జనప్రియా నగర్ కు చెందిన గొర్రెల కిరణ్ ని జనరల్ సెక్రెటరీగా నియమించటం జరిగింది
ఈ మేరకు సమితి జాతీయ అధ్యక్షులు జైన్ కుమార్ నియామక పత్రం అందచేశారు. శేర్లింగంపల్లి జనరల్ సెక్రటరీ జి కిరణ్ మాట్లాడుతూ మన పర్యావరణాన్ని
రక్షించుకోవాలంటే ప్రజలందరు మట్టి వినాయకుణ్ణి మాత్రమే పెట్టాలని విగ్రహాలు కెమికల్ తో మిక్స్ చేయకుండా స్వచ్ఛమైన మట్టితో చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలని వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు ఇటువంటి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అన్నారు, అందరూ 2025 సంవత్సరంలో వినాయక చవితి ఘనంగా నిర్వహించాలని దీనికి అపార్ట్మెంట్లోని ప్రతి ఒక్కరు సహకరించాలని ఈ సందర్భంగా మాట్లాడారు. తనకు జనరల్ సెక్రెటరీగా బాధ్యతలు అప్పగించిన జైన్ కుమార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు..