పల్వంచ జడ్పీ హైస్కూల్‌లో వంటశాల షెడ్ ప్రారంభం
లక్ష రూపాయల ఖర్చుతో కేశిరెడ్డి ఫౌండేషన్ నిర్మాణం
ముఖ్య అతిథి తిమ్మాయగారి సుభాష్ రెడ్డి, చేతులమీదుగా ప్రారంభం
గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు
విద్యార్థుల భోజన సదుపాయాల కోసం వినూత్న ప్రయత్నం
సమాజ సేవలో ముందుండే కేశిరెడ్డి గురువేందర్ రెడ్డి,
తెలంగాణ స్టేట్ ఇంచార్జ్
(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 15
పల్వంచ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన వంటశాల షెడ్‌ను గురువారం ఘనంగా ప్రారంభించారు. దాదాపు లక్ష రూపాయల వ్యయంతో కేశిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ వంటశాల షెడ్‌ను ముఖ్య అతిథులుగా విచ్చేసిన తిమ్మాయగారి సుభాష్ రెడ్డి, ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్ రెడ్డి, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల భోజన సదుపాయాల మెరుగుదల కోసం కేశిరెడ్డి, గురువేందర్ రెడ్డి, ముందడుగు వేశారని స్థానికులు ప్రశంసించారు.