Site icon PRASHNA AYUDHAM

13 ఏళ్ల బాలుడి ప్రాణాలు తీసిన గాలిపటం

ప్రాణాలు
Headlines in Telugu:
  1. గాలిపటం కారణంగా విద్యుత్ షాక్, బాలుడి మరణం
  2. కుర్నపల్లి గ్రామంలో గాలిపటం ప్రమాదం
  3. 13 ఏళ్ల బాలుడు విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు
  4. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల బాలుడి ప్రాణాలు పోయిన ప్రమాదం
  5. కుర్నపల్లి గ్రామంలో విషాదం – గాలిపటం వల్ల ప్రాణనష్టం
నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలో సోమవారం ఉదయం ఘటన చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలుడు షేక్ మతిన్ హై వోల్టేజ్ విద్యుత్ తీగల సమీపంలో ఉన్న చెట్టుకు వేలాడుతున్న గాలిపటం కోసం చెట్టు పైకి ఎక్కి అ గాలిపటం తీసే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

షేక్ మతిన్, కుర్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి విద్యార్థిగా చదువుతున్నాడు, సోమవారం ఉదయం ఈ ఘ‌ట‌న చోటుచేసుకోవడంతో బాలుడి తల్లి సాయిదా బేగం తీవ్ర శోకానికి గురయ్యారు. తన కుమారుడు తనను ఒంటరిగా చేసి వెళ్లాడని తీవ్ర అవేదనతో కన్నీటి పర్యంతమయ్యారు. ఈ దురదృష్టకర సంఘటన వలన కుర్నపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

హై వోల్టేజ్ తీగలకు అనుకోని ఉన్న చెట్ల కొమ్మలను తొలగించక పోవడం వలనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వలనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version