రిజర్వేషన్లుకు, ప్రాతినిధ్యానికి తేడా తెలుసుకోండి:

రిజర్వేషన్లుకు, ప్రాతినిధ్యానికి తేడా తెలుసుకోండి:

 

IMG 20240912 WA0003

న్యాయమైన ప్రాతినిధ్యపు హక్కును పట్టుకొని పదేపదే రిజర్వేషన్లు అంటారేంటి విడ్డూరంగా? ప్రాతినిధ్య హక్కుకు, రిజర్వేషన్లకు తేడా తెలియని రాహుల్ భాయ్ సహా బీజేపీ అగ్రనేత అమిత్ షా గారు, ఇంకా మనువాద భావజాలం నరనరానా నింపుకున్న, ఎక్కిచ్చుకున్న మరికొందరు.. ఎలా చట్టసభ సభ్యులైనారు, ఎలా ఉన్నత పదవులు పొందినారు, అధిరోహించినారు? దేశానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వుంటూ.. వీలైతే, అవకాశం వస్తే.. దేశానికి ప్రధానమంత్రిగా కూడా పనిచేయాలని ఉవ్విళ్లురుతున్న రాహుల్ భాయ్.. రిజర్వేషన్లకు, ప్రాతినిధ్య హక్కుకు స్పష్టమైన, నిర్ధిష్టమైన తేడా తెలుసుకోవాలి కదా! రాజ్యాంగాన్ని పూర్తిగా, లోతుగా చదివి, అర్థం చేసుకోవాలి కదా! లేమన్ లెక్క ఏదిపడితే అది గుడ్డిగా మాట్లాడడం కరెక్ట్ కాదుకదా! మీకు రాహుల్ భాయ్ కి, వైరివర్గ శిభిరమైన మనువాదులకు తేడా ఏముంది?.నిన్న మీరు మూడు రోజుల US పర్యటనలో వివిధ రంగాల, వర్గాల ప్రముఖులతో జరిపిన ముఖాముఖి చర్చల్లో, సంభాషణల్లో బాగంగా.. అక్కడి కళాశాల విద్యార్థులతో ముచ్చటిస్తూ.. ఆ విద్యార్ధుల ప్రశ్నల్లో ఒకటైన ఇంకా ఎంతకాలం రిజర్వేషన్లు? అన్న ప్రశ్న విద్యార్ధుల వైపు నుంచి వ్యూహాత్మకంగా ముందస్తు మాట్లాడుకొని సంధింపచేయించి.. దానికి, మీనుంచి సమాధానం అన్నట్లు “రిజర్వేషన్ల” రద్దుకు సమయం రాలేదు, ఆసన్నం కాలేదు అన్న వ్యాఖ్యలు, మాటలు వినిపించడం అన్నది.. నిజంగా దేనిని సూచిస్తుంది, తెలియజేస్తుంది? అంతలోనే, ఇక్కడ భారతదేశంలో కేంద్ర హోంమంత్రిగా పనిచేస్తున్న బీజేపీ అగ్రనేత అమిత్ షా గారు.. బీజేపీ కేంద్రంలో అధికారంలో వున్నంతకాలం, కొనసాగినంతకాలం.. రిజర్వేషన్లను ఎవరూ తీసెయలేరు అని స్పందించడం. ఇలా భారత రాజ్యాంగంలో లేని అంశం, పదం, వాక్యం పట్ల పరస్పరం మాట్లాడడం చూస్తావుంటే.. అవగాహనా రాహిత్యాన్ని, తెలియనితనాన్ని, అమాయకత్వాన్ని, ఉద్దేశపూర్వక, నిందాపూర్వక ప్రస్తావనను ఒక బలమైన సమూహం, సమాజం మీద ఆపదించినట్లు కాదా? నిజంగా భారత రాజ్యంగంలో రిజర్వేషన్లే పొందుపరిచివుంటే.. వాటికి నిర్ధిష్టకాలపరిమితి విధించేవారు. అప్పుడు విధ్యార్తులన్న, సమాజంలో, దేశంలో, ప్రపంచవ్యాప్తంగా వుంటున్న తెలియని అమాయకులు సంధిస్తున్న.. ఎంతకాలం రిజర్వేషన్లు అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మీరన్నట్లు రిజర్వేషన్ల రద్దుకు సమయం రాలేదు అన్న సమాధానానికి అర్థంపర్థం వుంటుంది. అదే సమయంలో బీజేపీ వున్నంతవరకూ రిజర్వేషన్లు రద్దుచేయం అన్న అమిత్ షా జీ మాటకు కూడా పొంతన వుంటుంది.భారత రాజ్యాంగాన్ని, దాని స్ఫూర్తిని, అందాన్ని.. విలువను, గౌరవాన్ని, ప్రధాన్యత, ప్రాముఖ్యతను.. మహత్తరమైన, మహోన్నతమైన గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, ప్రాశస్త్యాన్ని.. ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని, పనితీరును.. దానిని రచించిన, నిర్మించిన ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, భారత జాతి ముద్దుబిడ్డ, బాబాసాహెబ్ Dr.B.R.AMBEDKAR ని అర్థం చేసుకోకుండా.. అందులో నిర్ధిష్ట, వాస్తవ అంశాలేంటో తెలుసుకోకుండా.. గుడ్డిగా, అనాలోచితంగా, అనైతికంగా, అజ్ఞానంగా, మూర్ఖంగా ఏదిపడితే అది మాట్లాడి.. ప్రజల దృష్టిలో, మరీ ముఖ్యంగా అంతర్జాతీయ వేదికలపై నవ్వులపాలు, పలచన, చులకన కారాదని.. చివరగా “రిజర్వేషన్ అంటే.. నిర్ధిష్ట కాలపరిమితితో కూడిన తాత్కాలిక వెసులుబాటు.. అదే ప్రాతినిధ్య హక్కు, భాగస్వామ్యం అంటే.. శాశ్వతంగా, నిత్యనూతనంగా.. ఈ రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థ కొనసాగినంతకాలం అన్న విస్తృత, చారిత్రక అర్థంతో కూడుకున్న అంశంగా రెండిటికి స్పష్టమైన తేడాను గమణించమని, తెలుసుకొమ్మని, మసులుకొమ్మని ఈ సందర్భంగా రిజర్వేషన్ల గురించి మాట్లాడే ప్రబుద్ధులకు, సంకుచితవాదులకు నిర్మాణాత్మకమైన సూచనచేస్తున్నా, హితవుపలుకుతున్నా, హెచ్చరిస్తున్నా:రండి.. భారత రాజ్యాంగంలో ఎక్కడేగానిలేని, వాడని, ఉచ్చరించని “రిజర్వేషన్, రిజర్వేషన్లు” అన్న పదం, పదాలను పదేపదే అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తూ, మాట్లాడుతూ.. ఒక బలమైన “”సమూహాన్ని, సమాజాన్ని”” అవమానపరుస్తున్న, అగౌరవపరుస్తున్న, కించపరుస్తున్న, ఆత్మన్యూనతాభావానికి గురిచేస్తున్న రాహుల్ భాయ్ లాంటి వాళ్ళకు తగిన గుణపాఠం చెపుదాం.. రిజర్వేషన్ కు, ప్రాతినిధ్య హక్కుకు తేడా తెలియని వాళ్ళును అంతర్జాతీయ వేధికలపైకి ఆహ్వానించవద్దు, పిలవవద్దని ప్రపంచానికి విన్నవిద్ధం.. సమీప భవిష్యత్తులో ప్రాతినిధ్య హక్కుకు, రిజర్వేషన్లకు మధ్య స్పష్టమైన తేడాపై విస్తృత స్థాయిలో చర్చలు, సంభాషణలు మరియు విశ్లేషణలు చేద్దాం.. వాస్తవం ఏంటో ప్రపంచానికి తెలియజేద్దాం…

Join WhatsApp

Join Now