Site icon PRASHNA AYUDHAM

జ్ఞానమే ఆడపిల్లలకు నిజమైన ఆభరణం,

జ్ఞానమే ఆడపిల్లలకు నిజమైన ఆభరణం,

మూఢనమ్మకాలపై మహిళా జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సు,

మెదక్ డీఎస్పి ప్రసన్నకుమార్,

మెదక్ పట్టణంలోని మహిళ జూనియర్ కళాశాలలో మెదక్ డిఎస్పి ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్ఞానమే ఆడపిల్లలకు నిజమైన ఆభరణమని మహిళల చైతన్యంతో దేశం అభివృద్ధి సాధ్యమని డీఎస్పీ ప్రసన్నకుమార్ అన్నారు.జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మెదక్ టౌన్ సీఐ నాగరాజు ఆధ్వర్యంలో ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో మహిళల రక్షణ- సైన్సు- మూఢనమ్మకాల నిర్మూలన అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ ప్రసన్నకుమార్ హాజరై మాట్లాడుతూ సమాజంలోని మూఢనమ్మకాలను విద్యార్థులు వదిలిపెట్టి శాస్త్రీయ సమాజ నిర్మాణానికి నడుం బిగించాలని. దొంగ స్వాములు భూత వైద్యులు ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఆర్థికంగా సామాజికంగా మోసం చేస్తున్నారని మూఢనమ్మకాలు లేని శాస్త్రీయ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని డ్రగ్స్ మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలన్నారు. ఈ సందర్భంగా సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జాతీయ కమిటీ సభ్యుడు ఉప్పులేటి నరేష్ మాంత్రికులు భూత వైద్యులు మోసం చేసే కుట్రలను సైన్స్ మ్యాజిక్ షో ద్వారా విద్యార్థులకు వాటి వెనుక దాగి ఉన్న రహస్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సిఐ నాగరాజు, ప్రిన్సిపాల్ యాతిరాజ్ వల్లి, పోలీస్ సిబ్బంది అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version