*అసంక్రమిత వ్యాధులపై అవగాహన -పరిసరాల పరిశుభ్రత*
*డాక్టర్ హిమబిందు*
*జమ్మికుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 25*
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ హిమబిందు ఉన్నారు.జమ్మికుంట మండలంలోని వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామములో డాక్టర్ హిమబిందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు వైద్య శిబిరంలో 67 మంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 3 మంది జ్వరం ఉన్న వారికి ఆర్ డీ. టి కిట్స్ ద్వారా డెంగీ మలేరియా పరీక్షలు నిర్వహించారు వెంకటేశ్వర్లపల్లి సైదాబాద్ గ్రామములో స్వచ్ఛ ధనం పచ్చ ధనం స్వచ్ఛతా హి కార్యక్రమములో భాగంగా ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశారు.సైదాబాద్ గ్రామములో 52 మంది గ్రామస్తులకి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఇద్దరు జ్వరపీడితులకి రక్త నమూనాలను సేకరించి వ్యాధినిర్దారణ పరీక్షల కొరకు ల్యాబ్ కి పంపించారు. వైద్య శిబిరములకు వచ్చిన గ్రామస్తులకు సీజనల్ వ్యాధులపై వ్యక్తి గత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. అసంక్ర మిత వ్యాధులు మధుమేహం రక్తపోటు వ్యాధుల పై అవగాహన కల్పించి, అవసరం ఉన్న వారికి పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఆహార అలవాట్ల గురించి అవగాహన కల్పించారు. ఈ వైద్య శిబిరములలో డాక్టర్ హిమబిందు, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, సూపర్ వైజర్ రత్నకుమారి,సదానందం, ఏఎన్ఎం లు రజిత, హైమావతి, పంచాయతీ కార్యదర్శి రంజితకుమార్ ఆశా కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.