*సమాచార హక్కు పరిరక్షణ చట్టం కమిటీ ఆధ్వర్యం లో…….*
*నూతన చట్టాలపై అవగాహన కల్పించిన కమిటీ డైరెక్టర్ ఎం.ఎ, సలీం…..*
ప్రశ్న ఆయుధం 9ఆగష్టు కామారెడ్డి :
రామారెడ్డి మండల కేంద్రంలోని ఉప్పల్ వాయి గ్రామంలోని గురుకుల పాఠశాల కళాశాలలో సమాచారహక్కు చట్టం పరిరక్షణ కమిటీ డైరెక్టర్ ఎంఎ సలీం ఆధ్వర్యంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన చట్టాలపై అవగాహన కల్పించారు.పాఠశాల కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ మోహన్ రెడ్డి, సురేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన చట్టాల అవగాహన కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ డైరెక్టర్ ఎంఎ సలీం మాట్లాడుతూ! కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకు వచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టం, భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టం,భారతీయ సాక్ష్యముల చట్టం,అదే విధంగా సమాచార హక్కుచట్టం- 2005,విద్యహక్కు చట్టాలతో
వివిధ చట్టాలపై విద్యార్థులకు పాఠశాల అధ్యాపకులకు,సిబ్బందికి అర్థమయ్యేటట్లు వివరించి, విశ్లేషించి, క్లుప్తంగా అవగాహన కల్పించారు.ఈ చట్టాలను ఉపయోగించి ప్రయోజనం పొందాలని కుటుంబ సభ్యులతో పాటు మీచుట్టూ ఉన్న పరిసరాల ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కార్యదర్శి సంకీ రతన్ కుమార్ మాట్లాడుతూ సమస్యాత్మకంగా గ్రామాల్లో పోలీసులతో ప్రజలు మమేకమై ఉండాలన్నారు ఘర్షణలకు పోకుండా ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించాలన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో జోనల్ అధ్యక్షులు సిర్ణపల్లి ప్రదీప్ కుమార్ జిల్లా భక్త న్యాయవాది ఈక శ్రీనివాస్ జిల్లా సలహాదారులు దండవుల లింఘమయ్య పట్టణ కార్యదర్శి రామచందర్ కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.