కొడంగల్ పట్టణంలోని రాఘవేంద్ర గార్డెన్ లో జరిగిన ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు

విజయోత్సవాలు
Headlines in Telugu
  1. “పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యత – మహాలక్ష్మి పథక విజయం”
  2. “రాష్ట్ర అభివృద్ధిలో కీలక నిర్ణయాలు – ప్రసాద్ కుమార్ ప్రసంగ విశేషాలు”
  3. “రైతులకు రెండు లక్షల రుణమాఫీ – నూతన సంక్షేమ పథకాలు”
  4. “ప్రజా వాణి ద్వారా ప్రజల సమస్యల పరిష్కారం – ప్రగతి భవన్ మార్పు”
  5. “అభివృద్ధి పథకాలతో ముందుకు పయనం – కొడంగల్ ప్రజా విజయోత్సవాలు”

కొడంగల్ పట్టణంలోని రాఘవేంద్ర గార్డెన్ లో జరిగిన ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి  గడ్డం ప్రసాద్ కుమార్    

పరిగి, తాండూర్ శాసన సభ్యులు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి, సంగీత, నాటక అకాడమీ చైర్ పర్సన్ ప్రొఫెసర్ అలేఖ్య పుంజల , ఫైనాన్స్ కమిషన్ సభ్యులు రమేష్, వైద్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లు రాజేశ్వర్ రెడ్డి, విజయ కుమార్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

● సంగీత, నాటక అకాడమీ చైర్ పర్సన్ ప్రొఫెసర్ అలేఖ్య పుంజల బృందంచే సాంస్కృతి కార్యక్రమాల ద్వారా ప్రజా పాలన పథకాలపై ప్రదర్శన నిర్వహించడం జరిగింది. 

 *ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్  ప్రసంగిస్తూ…*

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను ప్రభుత్వం అమలు చేసి చూపించింది.

ఇది రాజకీయ వేదిక కాదు, అధికారిక కార్యక్రమం అయినా నిజాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది.

గత ప్రభుత్వ హయాంలో ఒక కుటుంబం అధికారం, ధన దాహానికి నా తెలంగాణ ఆగం అయింది, అప్పుల పాలయ్యింది, గోస పడ్డది.

ప్రజలు మార్పును కోరుకున్నారు, తమ మనసులోని బాధను ఓటు రూపంలో తీర్పు ఇచ్చారు, ప్రజా ప్రభుత్వం వచ్చింది.

నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నది.

ఇది ప్రజల ప్రభుత్వం. పేదలు, రైతులు, మహిళలు, దళితులు, గిరిజన, మైనారిటీ, బడుగు బలహీన వర్గాల బాగు కోసం పనిచేస్తున్నది.

యువకులు, విద్యార్థులు, నిరుద్యోగుల ఆశలు తీరుస్తూ రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ, ప్రతి పేద ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్నది.

ప్రజా ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7, 2024 నాటికి సంవత్సరం పూర్తవుతున్నది.

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి 48 గంటలలోనే ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలైన మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలో మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగింది.

రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా అందించే వైద్య సేవల పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు ప్రభుత్వం పెంచి ఈ పథకం కింద అందించే చికిత్సల సంఖ్యను మొత్తం 1835 కి పెంచింది.

ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి 500 రూపాయలకే వంటగ్యాస్ సిలెండర్ సరఫరా, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగిస్తున్న గృహాలకు ఉచిత విద్యుత్ ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది.

పేద, బడుగువర్గాల సొంత ఇంటికల నెరవేర్చేందుకు ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అభయహస్తం హామీల అమలు కోసం “ప్రజాపాలన” కార్యక్రమం చేపట్టడం జరిగింది.

ప్రగతి భవన్ ను మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా మార్చి అక్కడ “ప్రజావాణి” కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలనుండి వారి సమస్యలపై దరఖాస్తుల స్వీకరిస్తూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

కవులు, కళాకారులు, సినిమా రంగానికి చెందినవారిని ప్రోత్సహించేందుకు ప్రజా కళాకారుడు గద్దర్ పేరిట అవార్డులను ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 పద్మ అవార్డులు పొందిన తెలుగు ప్రముఖులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున సన్మానించి వీరికి 25 లక్షల రూపాయల నగదు బహుమతి, నెలకు 25 వేల రూపాయల పెన్షన్ ను ప్రభుత్వం మంజూరు చేసింది.

 అధికారంలోకి వచ్చిన 11 మాసాలలోనే 50 వేల మందికి నియామక ఉత్తర్వులు అందజేశారు. ఉద్యోగాల కోసం గరిష్ట వయోపరిమితిని 44 నుంచి 46 సంవత్సరాలకు పెంచి మోగా డీఎస్సీ ని నిర్వహించిడంతో 11,062 మంది ఉపాధ్యాయులకు ఒకే రోజు నియామక పత్రాలను అందజేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కింది. మన జిల్లాలో 305 మంది ఉపాధ్యాయులుగా నియమించడం జరిగింది. 

 ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా రాష్ట్ర యువతను తీర్చిదిద్దేందుకు 65 ఐటిఐ లను అదునాతన సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దుతోంది. వికారాబాద్ జిల్లా కేంద్రంలో నూతన ఏటీసీ నిర్మాణానికి నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షలతో భూమి పూజ చేసుకున్నాం

మన వికారాబాద్ జిల్లా కేంద్రంలో స్కిల్ యూనివర్సిటీ కి అనుబంధంగా ఐటీఐ ఏర్పాటు చేస్తున్నాం. 

రాష్ట్రంలో నిరుద్యోగులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం రాష్ట్ర జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసింది.

 గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేని విధంగా పలు చర్యలు తీసుకుంది.

 చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు నూతన విధానాన్ని రూపొందించింది.

ఈ ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 8 మెడికల్ కాలేజీలకు కేంద్రం నుంచి అనుమతులు సాధించింది.

•ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు కబ్జాలకు గురికాకుండా భవిష్యత్తు తరాల మేలు కోసం హైడ్రా ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీ నుంచి మండల కేంద్రానికి, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ నగరానికి రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించడం జరిగింది.

రాష్ట్రంలో వ్యవసాయ రంగంతోపాటు, అన్ని వర్గాలకు 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తోంది. విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్తు ఇస్తోంది.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు మాసాలలోనే రైతన్నలకు ఏక కాలంలో రెండు లక్షల రూపాయల వరకూ రుణమాఫీ చేసింది. 22 లక్షల మంది రైతుల ఖాతాలలో సుమారు 18 వేల కోట్ల రూపాయలను జమచేసి వారిని రుణ విముక్తులను చేసింది.

పంట పెట్టుబడి కోసం తొలివిడత 69 లక్షల మంది రైతులకు రూ.7,500 కోట్లు వారి బ్యాంకు ఖాతాలలో జమచేసింది.

రాష్ట్రంలో సన్నరకం వరిధాన్యానికి క్వింటాలుకు రూ. 500 బోనస్ అందించడం జరుగుతోంది.

అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 26,825 పాఠశాలలలో మౌలిక సదుపాయల కల్పనకు 1135 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందని , పాఠశాలల నిర్వహణా బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించడం జరిగింది.

మూసీ నదిని శుద్ధిచేసి, పునరుజ్జీవనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

రాష్ట్రంలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయించింది.

అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 26,825 పాఠశాలలలో మౌలిక సదుపాయల కల్పనకు 1135 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. పాఠశాలల నిర్వహణా బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించడం జరిగింది.

రాష్ట్రంలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయించిందని తెలిపారు.

 ఏడాది పాలనలో తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు అడుగులు పడ్డాయి, ఈ అడుగులు పరుగుగా మారి మన తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుంది.

మన మంచి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రజా ప్రభుత్వానికి మనమందరం అండగా నిలబడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment