కొడుకా.. లేవరా, 100 కోట్ల ఆస్తి పెట్టాను..!

*కొడుకా.. లేవరా, 100 కోట్ల ఆస్తి పెట్టాను*

*బీటెక్ విద్యార్థి భూమిక్ తండ్రి రోదన*

యశవంతపుర: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో మృతి చెందిన హాసన్ జిల్లా వాసి భూమిక్ (20) ఇంటిలో చెప్పకుండా ఈ కార్యక్రమానికి వచ్చి విగతజీవి అయ్యాడు. ఇంజనీరింగ్ చదువుతున్న భూమిక్ మృతితో తండ్రి తల్లడిల్లిపోతున్నారు. 100 కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించి భూమిక్ కోసం పెట్టానంటూ కొడుకు సమాధి వద్ద తండ్రి బోరుమంటున్న వీడియో అందరినీ కలిచివేస్తోంది.హాసన్ జిల్లా బేలూరు తాలూకా కుప్పుగోడుకు చెందిన లక్ష్మణ, అశ్విని దంపతులకు ఏకైక కుమారుడు భూమిక్. బెంగళూరులో ఉంటు ఇంజినీరింగ్ రెండో ఏడాది చదువుతున్నాడు. కాలేజీ స్నేహితులతో కలిసి చిన్నస్వామి స్టేడియం వద్దకెళ్లి తొక్కిసలాటలో మరణించాడు. విక్టోరియా ఆస్పత్రిలో గురువారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Join WhatsApp

Join Now