నాగారంలో ఏ జె ఇంటీరియర్స్ ప్రారంభం: యువత స్వయం ఉపాధిపై దృష్టి సారించాలి – కౌకుంట్ల చంద్రారెడ్డి

*నాగారంలో ఏ జె ఇంటీరియర్స్ ప్రారంభం: యువత స్వయం ఉపాధిపై దృష్టి సారించాలి – కౌకుంట్ల చంద్రారెడ్డి*

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం జూన్ 8

ప్రముఖ గృహ ఇంటీరియల్ డిజైన్ సంస్థ ఏ జె ఇంటీరియర్స్ సత్యనారాయణ కాలనీ రోడ్ నంబర్ 12లో ఘనంగా ప్రారంభమైంది. ఈ సంస్థను నాగారం మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా, తన స్వయం కృషితో పది మందికి ఉపాధి కల్పించాలనే ఆలోచనతో చక్కటి డిజైనర్ వృత్తిని ఎంచుకుని యువతకు మార్గదర్శకులుగా నిలిచిన డి. ఆంజనేయులు మరియు వారి సోదరుడు డి. కృష్ణ (బీకాం) లను అభినందించారు. ఉన్నత విద్య పూర్తి చేసుకున్న యువత వివిధ వృత్తి రంగాలలో నైపుణ్యం సాధించి, తమ కాళ్ళ మీద నిలబడే శక్తిని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బి.జి. శ్రీనివాస్ గౌడ్, బీజేపీ నాయకులు రామక్కపేట రవీందర్ రెడ్డి, వోల్లాల శ్రీనివాస్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, బి. సురేందర్ రెడ్డి, ఎం. శ్రీనివాస్ తో పాటు మిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment