పేదింటి యువకుడికి పునర్జన్మనిచ్చిన కోమటి రాజ్ గోపాల్ రెడ్డి
తన సొంత డబ్బుతో 12.50 లక్షలు వెచ్చించి కిడ్నీ మార్పిడి చికిత్స
కామారెడ్డి జిల్లా ప్రతినిధి(ప్రశ్న ఆయుధం) నవంబర్ 2
మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామానికి చెందిన పేద యువకుడు నెల్లి గణేష్ ప్రాణాలను కాపాడిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి . గణేష్‌కు కిడ్నీ సమస్య తీవ్రంగా ఉండటంతో రాజ్ గోపాల్ రెడ్డి సొంతంగా రూ.12.50 లక్షలు వెచ్చించి కామినేని ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చికిత్స చేయించారు. చికిత్స అనంతరం గణేష్ బాగోగులు తెలుసుకుని కుటుంబానికి ధైర్యం చెప్పారు. తన కుమారునికి పునర్జన్మనిచ్చినందుకు గణేష్ తల్లిదండ్రులు కన్నీటి కళ్లతో ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఆయన ఉదారతను ప్రశంసిస్తున్నారు.