కేంద్ర రవాణాశాఖ మంత్రితో కోమటిరెడ్డి సమావేశం.

గడ్కరీకి వినతులు – వెంటనే స్పందన..!

కేంద్ర రవాణాశాఖ మంత్రితో కోమటిరెడ్డి సమావేశం.

ప్రశ్న ఆయుధం – న్యూస్, ఢిల్లీ

• ఢిల్లీలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశం

• రాష్ట్రానికి అవసరమైన జాతీయ రహదారులపై మంత్రితో పాటు ఎంపీలు గడ్కరీ దృష్టికి వివరాలు

• హైదరాబాద్-విజయవాడ రహదారి విస్తరణపై తీవ్రంగా చర్చ

• ప్రమాదాలకు కేరాఫ్‌గా మారిన NH-65ను 6 వరుసలుగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి

• ఆగస్ట్ 15న ఫైనాన్స్ కమిటీ మీటింగ్‌లో NH-65కు ఆమోదం ఇవ్వనున్నట్లు గడ్కరీ హామీ

తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రంతో సమన్వయం కొనసాగుతోంది. మంగళవారం నాడు ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలకంగా సమావేశమయ్యారు. రహదారుల విస్తరణ, కొత్త మంజూరులపై సుదీర్ఘంగా చర్చించారు.

హైదరాబాద్ – విజయవాడ రహదారి (NH-65):

ఈ రహదారిపై ఇటీవలే జరిగిన ఘోర ప్రమాదాన్ని ఉదహరిస్తూ.. డెత్ రోడ్డుగా మారుతోందని గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై చలించిపోయిన గడ్కరీ, ఆగస్ట్ 15న జరిగే ఫైనాన్స్ మీటింగ్‌లో ఈ రహదారి విస్తరణకు ఆమోదం ఇస్తామని హామీ ఇచ్చారు. 6 వరుసల రహదారి, సర్వీస్ రోడ్లతో పాటు వెంటనే టెండర్లు పిలవాలని సూచించారు.

రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్):

సంగారెడ్డి – చౌటుప్పల్ మధ్య ఉత్తర భాగానికి భూసేకరణ పూర్తయిన విషయాన్ని మంత్రి వివరించారు. 6 వరుసలుగా మారుస్తున్నామని.. రీవైజ్డ్ ఎస్టిమేట్‌లతో మూడు నెలల్లో పనులు ప్రారంభించాలని కోరారు. దక్షిణ భాగాన్ని కూడా తక్షణమే ప్రారంభించాలంటూ గడ్కరీని కోరారు.

ఎల్ బీ నగర్ – మల్కాపూర్ ఎలివేటెడ్ కారిడార్:

హయత్ నగర్ నుంచి ఆల్ ఇండియా రేడియో స్టేషన్ వరకు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి గడ్కరీ అంగీకారాన్ని తెలిపారు. వెంటనే ప్రతిపాదనలు పంపాలని సూచించారు.

హైదరాబాద్ – శ్రీశైలం రహదారి (NH-765):

టైగర్ రిజర్వ్ ఏరియా పైగా వెళ్లే ప్రాంతాన్ని ఎలివేటెడ్ కారిడార్‌గా అభివృద్ధి చేయాలని కోమటిరెడ్డి విజ్ఞప్తి చేయగా, గడ్కరీ అంగీకరించారు. ఇది 62 కి.మీ. నుంచి 58 కి.మీ.కు తగ్గనుందని వివరించారు.

హైదరాబాద్ – మన్నెగూడ రహదారి:

ఎన్.జి.టి.లో ఉన్న అంశాన్ని త్వరగా పరిష్కరించి పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

సేతుబంధన్, సిఆర్ఐఎఫ్ ప్రాజెక్టులు:

ఈ పథకాల కింద కూడ మంజూరులు ఇప్పించేందుకు ప్రపోజల్స్ పంపాలని కేంద్ర మంత్రి సూచించారు.

కేంద్రానికి కృతజ్ఞతలు:

రాష్ట్రానికి అవసరమైన ప్రతీ రహదారి అంశంలో గడ్కరీ ఎంతో సహృదయంగా స్పందించారని, హ్యామ్ విధానంలో ఇప్పటికే అనేక పనులు ప్రారంభించామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఉప్పల్ ఫ్లైఓవర్ పనులపై తనిఖీలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

మొత్తంగా: కేంద్ర మంత్రి గడ్కరీతో సమావేశం సంతృప్తికరంగా జరిగిందని, రాష్ట్రానికి ఎంతో మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు.

Join WhatsApp

Join Now

Leave a Comment