నాగారంలో కోణార్క్ ఎలక్ట్రానిక్స్ స్మార్ట్ ప్లాజా ఘనంగా ప్రారంభం
మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ లు లాంఛనంగా ప్రారంభించారు
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం అక్టోబర్ 17:
మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకు అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ షాపింగ్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో, నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన కోణార్క్ ఎలక్ట్రానిక్స్ స్మార్ట్ ప్లాజా శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది.
సాంకేతికతను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ స్మార్ట్ ప్లాజా ప్రారంభోత్సవానికి మేడ్చల్ రాజకీయ వర్గాల నుండి విశేష స్పందన లభించింది.
ముఖ్య అతిథులుగా మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మరియు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ హాజరై, రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి షోరూమ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వారు షోరూమ్‌లో ప్రదర్శించిన తాజా ఎలక్ట్రానిక్ పరికరాలు, సరికొత్త మోడళ్లు ఆసక్తిగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ,
“నాగారం ప్రాంతంలో అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ అందించాలనే సంకల్పంతో ఈ షోరూమ్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయం. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని శాఖలు స్థాపించాలని కోరుకుంటున్నాం,” అని తెలిపారు.
షోరూమ్ యజమానులు, యువ పారిశ్రామికవేత్తలు శ్రీకాంత్ గౌడ్, రాకేష్, రవీందర్ లను ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా అభినందించారు.కోణార్క్ ఎలక్ట్రానిక్స్ స్మార్ట్ ప్లాజా ప్రారంభంతో, ఈ ప్రాంత ప్రజలు ఇకపై అత్యాధునిక ఎలక్ట్రానిక్ వస్తువుల కోసం దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా, అన్ని అవసరాలు ఒకే వేదికపై అందుబాటులో ఉంటాయని యాజమాన్యం పేర్కొంది.