కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా
తెలంగాణ సాధనకు అపార కృషి చేసిన మహనీయుడు – BRS నాయకులు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 27
శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా BRS అసెంబ్లీ ఇంచార్జ్ గంప గోవర్ధన్ ఆదేశాల మేరకు పట్టణ శాఖ ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకుడు అర్కల ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ బాపూజీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి పదవులు, ఆస్తులు త్యాగం చేసి ప్రజలకు స్ఫూర్తినిచ్చారని పేర్కొన్నారు. వారి ఆశయాల సాధనకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.