కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా
తెలంగాణ స్టేట్ ఇంచార్జ్
(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 27
కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ పితామహుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు, శనివారం ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ బాపూజీ చిత్రపటానికి పూలమాల అర్పించి నివాళులు ఘటించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ –
“కొండా లక్ష్మణ్ బాపూజీ, నిజమైన ప్రజానాయకులు. స్వాతంత్ర పోరాటం, నిజాం వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఐదు దశాబ్దాల పాటు అలుపెరగని పోరాటం చేశారు. తన ఇంటిని, ఆస్తులను సైతం తెలంగాణ కోసం త్యాగం చేసిన మహనీయుడు. ఆయన జీవితం నుంచి యువత ప్రేరణ పొందాలి. ప్రజాసేవ మార్గంలో నడవాలి” అని పిలుపునిచ్చారు.
వేడుకల్లో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ టి. శ్రీధర్, ఆర్ఐలు నవీన్, కృష్ణ, డిపీఓ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.