కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ ఉద్యమకారుడు స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు 

 

*జమ్మికుంట ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 27*

 

శుక్రవారం రోజున మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో గల గరుడ చౌరస్తాలో స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకుడు వంగ రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర సమరయుడు తెలంగాణ ఉద్యమకారుడు స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వంగ రామకృష్ణ మాట్లాడుతు కొండ లక్ష్మన్ బాపూజీ స్వాతంత్రోద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో బ్రిటిష్ కు వ్యతిరేకంగా అబిడ్స్ పోస్ట్ ఆఫీస్ కోటిలో ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీ పై జాతీయ జెండా ఎగుర వేసి సంచలనం సృష్టించారని నిరంకుశ నిజాం వ్యతిరేకంగా నిజాంపై బాంబు దాడి కుట్ర చేశారు తొలి,మలితరం తెలంగాణ ఉద్యమలలో , చురుకుగా పాల్గొన్నా నిఖార్సయిన తెలంగాణ వాది అని తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడు జలదృశ్యం తన ఇంటిని కేసీఆర్ కి ఇచ్చి తుదిదశ ఉద్యమాన్ని నడిపించారని 96 యేళ్ళ వయస్సులో ఎముకలు కోరికే చలిలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసి ఉద్యమకారులకు స్ఫూర్తి నింపారు రాష్ట్ర చేనేత రంగాన్ని అభివృద్ధికి కృషి చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో డిసిసి జనరల్ సెక్రటరీ గూడెపు సారంగపాణి బిసి మండల అధ్యక్షుడు ఆరెల్లి రమేష్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు కనుమల్ల రామకృష్ణ బినవేని మహిపాల్ యాదవ్ దంసాని తిరుపతి మహేష్ రమేష్ ఐలయ్య సారంగం వీరరెడ్డి జెలెందర్ రెడ్డి,ఎల్లయ్య,రఫీ మదన్ రావు, యూత్ కాంగ్రెస్ నాయకులు మారపల్లి వంశి భోగం శ్యామ్,రాజు,అభి,తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now