బహుజనుల దర్శానికుడు కొండ లక్ష్మణ్ బాపూజీ

*బహుజనుల దార్శనికుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ*

 

*బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి*

 

*కరీంనగర్ ప్రశ్న ఆయుధం న్యూస్ బ్యూరో సెప్టెంబర్ 21*

 

కొండా లక్ష్మణ్ బాపూజీ అణగారిన వర్గాలకు భీష్మ పితామహుడని బలహీన వర్గాలకు బాపూజీ ఆశాజ్యోతి గా నిలిచారని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కొనియాడారు శనివారం రోజున బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు గంగాడి కృష్ణారెడ్డి కరీంనగర్లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఆయన మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం కృషి చేసిన తొలి తరం ఉద్యమకారుడు, బడుగు బలహీన వర్గాల స్ఫూర్తిదాత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కి బిజెపి జిల్లా పక్షాన ఘన నివాళులు అర్పిస్తున్నట్టు చెప్పారు. నిజాం నిరంకుశ ప్రభుత్వాన్ని ఎదిరించి హైదరాబాద్ సంస్థానపు పోరాట ఉదృత స్వభావాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిన ఉద్యమ కెరటం కొండా లక్ష్మణ్ బాపూజి అని నేడు దేశంలోనే అత్యున్నత పారిశ్రామిక ప్రాంతాలుగా విలసిల్లుతున్న హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్లు బాపూజీ దూర దృష్టికి దర్శనికతకు నిలువెత్తు నిదర్శనమని కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం లాంటిదన్నారు. ఇట్టి కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులువాసల్గిలపు రమేష్, మాజీ ఎంపీపీ వాసల రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కళ్లెం వాసుదేవ రెడ్డి, దండు కొమరయ్య, ఎడమ సత్యనారాయణ రెడ్డి, వంగలపవన్, ప్రవీణ్ , అసెంబ్లీ కన్వీనర్ దుబ్బాల శ్రీనివాస్ , మాసం గణేష్ , కైలాస నవీన్, రాజు , సంతోష్ , లతోపాటు బిజెపి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ , నాయకురాలు వరాల జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now