Site icon PRASHNA AYUDHAM

కొండ లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలు ఘనంగా

IMG 20250927 WA0016

కొండ లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలు ఘనంగా

నిజామాబాద్ కమిషనరేట్‌లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ

ప్రతినిధి, సెప్టెంబర్ 27 (ప్రశ్న ఆయుధం)- నిజామాబాద్

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌ కార్యాలయంలో కొండ లక్ష్మణ్ బాపూజీ గారి 110వ జయంతి వేడుకలను పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం  నాడు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు నిర్వహించబడింది. కార్యక్రమానికి అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

జయంతి వేడుకల సందర్భంగా:

అదనపు డీసీపీ బస్వారెడ్డి మాట్లాడుతూ –

> “కొండ లక్ష్మణ్ బాపూజీ ప్రజాస్వామిక విలువలకు నిలయంగా నిలిచిన మహానుభావుడు. సాయుధ పోరాట సమయంలో పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడిన బాపూజీ, న్యాయవాదిగా నిరుద్యోగ రైతుల తరపున న్యాయపోరాటం చేసిన మహానాయకుడు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. అణగారిన వర్గాల హక్కుల కోసం, సహకార రంగాల బలోపేతానికి జీవితాంతం కృషి చేశారు,” అని ఆయన పేర్కొన్నారు.

అలాగే, ప్రతి ఒక్కరూ బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములవ్వాలని, భావితరాల భవిష్యత్తు కోసం శ్రమించాలనే పిలుపునిచ్చారు.

పాలుగన్న అధికారులు, సిబ్బంది:

ఈ జయంతి వేడుకలో

కమిషనరేట్ పరిపాలన అధికారి (AO)  ఆసియా బేగం,

ఆఫీస్ సూపరింటెండెంట్ శంకర్, బషీర్, వనజారాణి,

రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, తిరుపతి,

పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ వీరయ్య,

సి.సి.ఆర్.బి, సి.ఎస్బి, ఐటీ కోర్, సెంట్రల్ కంప్లైంట్ సెల్,
తదితర విభాగాల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

జయంతి సందర్భంగా బాపూజీ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించడం జరిగింది.

Exit mobile version