అమరవీరుల స్థూపానికి మరమ్మత్తులు చేయించిన కోనేరు శశాంక్
ప్రశ్న ఆయుధం 11 మార్చి ( బాన్సువాడ ప్రతినిధి )
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని కోయగుట్ట చౌరస్తాలో ఉన్న అమరవీరుల స్తూపం శిథిలావస్థకు చేరింది. దీంతో స్థానికులు స్తూపం మరమ్మతులు చేపట్టాలని కోరుతూ చాలా రోజులుగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు కోనేరు శశాంక్ స్తూపాన్ని సందర్శించారు.స్తూపం శిథిలావస్థను ప్రత్యక్షంగా పరిశీలించి, మరమ్మతులు చేయించారు.అనంతరం అమరవీరులకు నివాళులు అర్పించారు. అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని, వారి స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని శశాంక్ ఈ సందర్భంగా అన్నారు.