కోను కార్పొరేష్ చెట్లను తొలగించాలి

సిద్దిపేట మున్సిపాలిటీలో విరివిగా ఉన్న కోనో కార్పస్ చెట్లను తొలగించాలి.

ధర్మ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా కమిటీ

సిద్దిపేట ఆగస్టు 8 ప్రశ్న ఆయుధం :

సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్మ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బోయిని సదన్ మహారాజ్ మరియు రాష్ట్ర కార్యదర్శి కర్రోళ్ల రవిబాబు గార్లు మాట్లాడుతూ సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రజా ఆరోగ్యానికి మరియు జీవ వైవిధ్యానికి ప్రమాదకరమైన కోనో కార్పస్ చెట్లను తొలగించి వాటి స్థానంలో ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చే మరియు ఇతర మొక్కల్ని నాటాలని ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు కోనో కార్పస్ చెట్లను తొలగించే విషయంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. తదనుగుణంగా సిద్దిపేట మున్సిపాలిటీ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోనో కార్పస్ చెట్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని, వర్షాల వలన పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిని మురుగునీరు నిలవడం వల్ల పట్టణంలో దోమల బెడద ఎక్కువ అయి సీజనల్ విష జ్వరాలు పెరిగే ఆస్కారం కలుగుతున్నది. కావున డ్రైనేజీని పునరుద్ధరించి దోమల మందును పిచికారి చేయాలని, చెత్త సేకరణలో జాప్యం లేకుండా చూడాలని అన్నారు. ఈ వర్షాకాలంలో మున్సిపల్ సిబ్బంది మరియు పారిశుద్ధ్య కార్మికులకు తగు రక్షణ సదుపాయాలు కల్పించాలని, అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో కుక్కల బెడద తీవ్ర తరమై వాహన చోదకులకు మరియు స్కూల్ పిల్లలకి, పసిపిల్లలకి ఇబ్బంది కలిగి ప్రమాదాలు జరుగుతున్నందున కుక్కల సంఖ్యను తగ్గించేందుకు పరిష్కార చర్యలు చేపట్టాలని అన్నారు. విద్యుత్ కి అంతరాయం కలిగిస్తున్న చెట్ల కొమ్మలను తొలగించి విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని అన్నారు. అదేవిధంగా మున్సిపల్ పరిధిలో ఉన్న ఇతర సమస్యల పైన దృష్టి పెట్టి పని చేయాలి అని అన్నారు. స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం ఇవన్నీ ఏమీ చేయకుండానే కేవలం ప్రచార ఆర్భాటాలతో మాత్రమే కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు చందు, ప్రధాన కార్యదర్శి యాదగిరి నాయకులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now