Headlines:
-
“ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమావేశంలో పాల్గొన్నారు”
-
“ప్రజా సమస్యలు: ఎమ్మెల్యే ఉద్ఘాటనలు”
-
“భవిష్యత్ ప్రభుత్వ విధానాలపై చర్చ”
-
“కాకరాయలు: నాయకుల పాలు”
కూకట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం పోల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 29: కూకట్‌పల్లి ప్రతినిధి
కూకట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఫతేనగర్ డివిజన్ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని పరిస్థితులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం మానేసి ప్రతిపక్షాలపై కక్షపూరితంగా వ్యవహరిస్తుండటం సిగ్గుచేటన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గాలికి వదిలేశారని, నిధులు లేక పురపాలికలు దిక్కులు చూస్తున్నాయని నిత్యం ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్ల కాలంలో బిఎఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే నేటికి కొనసాగుతున్నాయని వాటినే నేటి ప్రభుత్వ పెద్దలు ప్రారంభిస్తున్నారని తెలిపారు. పదినెలల కాలంలో కొత్తగా పనులు మొదలు పెట్టకపోవడంతో హైదరాబాద్ నగరంలోని ప్రజలు సమస్యలతో కొట్టు మిట్టాడాల్సిన పరిస్థితి నెలకొనడం దురదృష్టకరమన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పనులు నిధుల లేమితో నత్తనడకన నడుస్తున్నాయన్నారు. ప్రజల సమస్యలపై నాయకులు కార్యకర్తలు దృష్టిపెట్టి అందుబాటులో ఉండాలని సూచించారు. సమస్యలను పరిష్కరించడం మానేసి పన్నులు పెంచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. వీధి దీపాల సమస్యలు మొదలు కొని రోడ్లు, డ్రైనేజ్ , తాగు నీరు, ఆఖరికి వీధి కుక్కల సమస్యల వరకు అన్నీ పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం మరింత కక్షపూరితంగా వ్యవహరించడంతో పాటు అక్రమంగా కేసులు కూడా నమోదు చేసి బీ ఆర్ ఎస్ పార్టీనీ మరింత ఇబ్బందులకు గురిచేయ వచ్చని వాటిని ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ….
బిక్షపతి రాములు అన్న సుదర్శన్ రెడ్డి , కన్నయ్య , బాలకృష్ణ , శశి , నంద కుమార్ , శంకర్ గౌడ్ , ఆఫ్జాల్ , సలావుద్దీన్ , గౌస్ భాయ్ , రాము , రాజకుమార్ , సతీష్ ,మహేంద్ర . సాగర్ రాంరెడ్డి ., భాగ్య , డేవిడ్ సురేందర్ ,శిల్ప , కృష్ణ కుమారి , బేగం , రహిమ , బలమని , జ్యోతి గౌడ్ త ధితరులు పోల్గొన్నారు.