Site icon PRASHNA AYUDHAM

కలెక్టరేట్ దీక్షను జయప్రదం చేయండి- కొప్పుల శంకర్

*గ్రామపంచాయతీ కార్మికుల కరీంనగర్ కలెక్టరేట్ దీక్షను జయప్రదం చేయండి*
*సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్*

*ఇల్లందకుంట నవంబర్5 ప్రశ్న ఆయుధం::-*

తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయీతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలని, జీవో నెంబర్ 51 సవరించి మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని పంచాయతీ ఉద్యోగ కార్మికులందరినీ పర్మిట్ చేయాలని, కరోబార్ బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్టేటస్ కల్పించాలని సహాయ కార్యదర్శులుగా నియమించాలని అర్హులైన కార్మికులందరినీ విధి నిర్వహణలో చనిపోయిన కార్మికులకు 10 లక్షలు ప్రకటించాలని అలాగే పిఎఫ్ ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం బుధవారం ఈనెల ఆరవ తేదీన జరిగే కలెక్టరేట్ వద్ద దీక్ష కార్యక్రమానికీ జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల నుండి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మంగళవారం రోజున ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామంలో విలేకరుల సమావేశంలో కొప్పుల శంకర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఇచ్చే అరకొర జీతాలు రెండు నెలల కు మూడు నెలలకు ఇస్తే వారి కుటుంబాలు ఎలా పోషించుకుంటారని ప్రశ్నించారు కార్మికులందరి వెంటనే పర్మినెంట్ చేయాలని ఆలోపు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందకుంట మండల జీపీ యూనియన్ అధ్యక్షుడు కొత్తూరు మల్లయ్య రామంచ రాజేందర్ అనిల్ నరసయ్య మొగిలి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version