*కపిల్ విద్యా వారధి స్కాలర్షిప్ కు ఎంపికైన కోరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని*
*జమ్మికుంట జూన్ 25 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని కోరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2024-25 సంవత్సరo 10వ తరగతి చదివి మండలంలో మొదటి ర్యాంక్ సాధించిన గిరవేన స్పందన ఇటీవల కపిల్ చిట్ ఫండ్ వారి నిర్వహించిన టాలెంట్ టెస్ట్ రాసి ఉన్నత మార్కులు పొంది “కపిల్ విద్యా వారధి”కి ఎంపిక అయ్యిందని కపిల్ విద్యా వారధికి ఎన్నిక కావడంతో కపిల్ చిట్ ఫండ్ వారు గిరవేన స్పందన ఎంతవరకు చదివితే అంతవరకు ఏ కోర్సు చదివితే ఆ కోర్సులకు సంబంధించిన ఫీజులను మొత్తం చెల్లిస్తుందని చిట్ ఫండ్ యాజమాన్యం తెలిపారు అనంతరం ఎంఈఓ హేమలత మాట్లాడుతూ కోరపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల శ్రద్ధ, విద్యార్థుల కృషి వల్ల పదవ తరగతిలో కోరపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని విద్యార్థులు స్పందనను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు బాగా చదవాలని కోరారు విద్యార్థి గిరవేన స్పందన మాట్లాడుతూ తన విజయానికి తన తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉపాధ్యాయుల బాధ్యతాయుతమైన బోధనే కారణమని వారికి కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం గిరివేన స్పందన ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు మిడిదొడ్డి సమ్మయ్య మండల విద్యాధికారి మంతెన హేమలత అమ్మ ఆదర్శ కమిటీ చైర్పర్సన్ బండారి రజిత, మార్కెట్ కమిటీ డైరెక్టర్ , తాళ్ళపెల్లి శ్రీనివాస్, గ్రామస్తులు గిరవేన శ్రీనివాస్, కల్లెపెల్లి జంపయ్య పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని స్పందనను అభినందించారు.