Site icon PRASHNA AYUDHAM

తిమ్మాపూర్ ధాన్యం కేంద్రాన్ని పరిశీలించిన గిడ్డంగుల ఎం.డి. కొర్ర లక్ష్మి

IMG 20251022 WA0683 1

రైతులతో నేరుగా మాట్లాడిన ఎం.డి.

రిజిస్టర్లు, తూకం ప్రక్రియపై సమీక్ష

కేంద్రంలో పారదర్శకంగా కొనుగోలు జరగాలని ఆదేశాలు అదనపు కలెక్టర్ విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయి పాల్గొనడం…జిల్లా అధికారులందరితో సమన్వయం సూచన,,బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర గిడ్డంగుల మేనేజింగ్ డైరెక్టర్ కొర్ర లక్ష్మి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పాటించాలని సూచించారు. కేంద్రంలో నిర్వహణ పద్ధతులు, రిజిస్టర్లు, తూకం యంత్రాలు పరిశీలించారు.

అధికారులందరితో చర్చించిన ఎం.డి. కొర్ర లక్ష్మి, రైతులకు సకాలంలో చెల్లింపులు జరగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా డీఎస్ఓ వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ పీడీ సురేందర్, డిసిఓ రామ్మోహన్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య, డీఎం శ్రీకాంత్, డిపిఎం సాయిల్ ఏపిఎం శిరీష, సెంటర్ ఇన్‌చార్జి మహేందర్, గ్రామ సంఘం అధ్యక్షురాలు లక్ష్మి, వివోఏ కవిత, కమిటీ సభ్యులు మోహన్ కృష్ణతో పాటు రైతులు పాల్గొన్నారు.

Exit mobile version