కోరుట్ల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం: 16 అంశాలకు ఆమోదం
పురపాలక కార్యాలయంలో కౌన్సిల్ సభ్యుల చర్చా కార్యక్రమం
చైర్ పర్సన్ అన్నం లావణ్య నేతృత్వంలో కోరుట్ల మున్సిపల్ సమావేశం
నూతన అభివృద్ధి ప్రణాళికలకు సభ్యుల అనుమతి
కోరుట్ల పురపాలక సంఘ కార్యాలయం సమావేశ మందిరంలో శనివారం చైర్ పర్సన్ అన్నం లావణ్య అధ్యక్షతన సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో 16 అంశాలను పొందుపరచగా పలు అంశాలకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్రీమతి అన్నం లావణ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీది పవన్, కమిషనర్ బట్టు తిరుపతి, డి.ఇ.ఇ సురేష్, మేనేజర్ సి.హెచ్ శ్రీనివాస్, టి.పి.ఓ ఎ.ప్రవీణ్ కుమార్, జె.ఎ.ఓ వి.శివకుమార్, ఏ.ఇ అరుణ్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్స్, కో-ఆప్షన్ సభ్యులు, ఆఫీస్ సిబ్బంది పాల్గోన్నారు.