కొత్తగూడెం పాల్వంచ పట్టణాలకు కార్పొరేషన్ హోదా తీసుకొచ్చిన

కూనoనేనికి,మద్దెల అభినందనలు
కొత్తగూడెం పాల్వంచ పట్టణాలకు కార్పొరేషన్ హోదా రావడానికి శ్రమించిన కూనంనేని కృషి,చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదనీ ఉన్నారు.
అభ్యుదయ కళా సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ కొత్తగూడెం ఎమ్మెల్యే కార్యాలయంలో అభినందించి మాట్లాడారు. తెలంగాణ క్యాబినెట్ ఆమోదముద్ర వేయడాన్ని ఒక చారిత్రాత్మక ఘట్టంగా
అభివర్ణిస్తూ, ఇది కొత్తగూడెం పాల్వంచ పట్టణాల అభివృద్ధికి మహర్దశ కాబోతుందని, పట్టువదలని విక్రమార్కుడిలా,తన సర్వశక్తులు ఒడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలను
మంత్రులందరి దగ్గరికి పదేపదే వెళ్లి సాకారం అయ్యేలా నిర్విరామ కృషి చేసిన, మన కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి అహర్నిశలు కృషి చేస్తున్న అభివృద్ధి సాధకులు మన కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు పట్టుదల, లక్ష్యాన్ని సాకారం చేసిన కృషి చారిత్రాత్మకమైనదని,సువర్ణ అక్షరాలతో లిఖించదగినదని, భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, అభ్యుదయ కళాసేవ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, కవి సినీ గీత రచయిత గాయకులు సమాజసేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు.

Join WhatsApp

Join Now