వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి

సంగారెడ్డి/పటాన్ చెరు, అక్టోబర్ 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): గుమ్మడిదల మండలం రామిరెడ్డిబావి గ్రామంలో రైతుల సౌకర్యార్థం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఇబ్బందులు లేకుండా తమ పంటలను ప్రభుత్వ నిర్ణయించిన కనీస మద్దతు ధరకు విక్రయించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. రైతులు నేరుగా కేంద్రానికి తమ పంటను తూకం వేసి అమ్ముకునేలా సౌకర్యాలు కల్పించామన్నారు. రైతుల కష్టాన్ని గౌరవించే ప్రభుత్వం కాంగ్రెస్‌దేనని, రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, సహకార సంఘ ప్రతినిధులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఉమాదేవి, ఏవో శ్రీనివాస్ రావు, సొసైటీ వైస్ చైర్మన్ దయాకర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింగ్ రావు, ఆత్మ కమిటీ డైరెక్టర్ శంకర్, సింగల్ విండో సొసైటీ డైరెక్టర్ జయశంకర్ గౌడ్, సింగల్ విండో సొసైటీ లచ్చిరాం, నాయకులు మద్ది వీరారెడ్డి, నాగేందర్ గౌడ్, గోవర్ధన్ గౌడ్, అంజాద్ ఖాన్, వెంకటేష్, మహిపాల్ రెడ్డి, గోపాల్ రెడ్డి, రవీందర్, లక్ష్మీనారాయణ, దయాకర్ రెడ్డి, జంగారెడ్డి, పాషా తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now