కొత్తపల్లి దొంగతనం కేసు ఛేదన!
మాచారెడ్డి ఎస్ఐ ఎస్ అనిల్
దొంగిలించిన బంగారు ఉంగరం, వెండి గొలుసు స్వాధీనం – ఇద్దరు దొంగలు అరెస్ట్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 16
మాచారెడ్డి, జూన్ 2: కొత్తపల్లి గ్రామంలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. స్థానికుడు ఆమ లక్ష్మీనారాయణ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసిన ఐదు మాసాల బంగారు ఉంగరం, మూడు మాసాల వెండి గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో రాయన పట్ల రాజు (21) కొత్తపల్లి గ్రామానికి చెందినవాడు, మేకల మాధవ్ (36) మాచారెడ్డి నివాసి అని గుర్తించారు. ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. దొంగతనంపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నది.