సిద్ధి రామేశ్వర దేవాలయంలో కోటి దీపోత్సవం వైభవం

సిద్ధి రామేశ్వర దేవాలయంలో కోటి దీపోత్సవం వైభవం

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రత్యేక పూజల్లో పాల్గొనడం జరిగింది

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 20 

 

కామారెడ్డి, గురువారం:

సిద్ధి రామేశ్వర దేవాలయంలో కోటి దీపోత్సవం సందర్భంగా గురువారం నిర్వహించిన మహోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన కలెక్టర్‌కు ప్రధాన అర్చకులు వేద మంత్రాలతో ఘన స్వాగతం పలికారు. తదనంతరం కలెక్టర్ దేవాలయ దర్శనం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపోత్సవంలో పాల్గొని భక్తులతో కలిసి దీపాలను వెలిగించారు. దేవాలయ పరిసరాలు, భక్తుల సౌకర్యాలు, నిర్వహణ వ్యవస్థలను పరిశీలించిన కలెక్టర్… అవసరమైన ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు.              కోటి దీపోత్సవం సందర్భంగా దేవాలయం సంపూర్ణంగా వెలుగులతో కళకళలాడి, భక్తి వాతావరణం నెలకొంది.

Join WhatsApp

Join Now