కోటిలింగేశ్వర నగర్ కాలనీ అధ్వాన్నం – అధ్యక్షుడి ఆవేదన
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని కోటిలింగేశ్వర నగర్ 4వ వీధి పరిస్థితి దారుణం
రోడ్లు, వీధి లైట్లు, మురికికాల్వలు లేవని అధ్యక్షుడు డాక్టర్ బట్టు విఠల్ ముదిరాజ్ విమర్శ
మురికితో నిండిపోవడంతో పాములు, విషపురుగులు, దోమలు, ఈగలతో ప్రజలు ఇబ్బందులు
ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి, ప్రభుత్వ విప్ షబీర్ అలీ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్
సమస్యలు పరిష్కరించకుంటే మహిళలు, పిల్లలతో కలిసి ఉద్యమిస్తామని కాలనీవాసుల హెచ్చరిక
ప్రశ్న ఆయుధం ఆగష్టు 24కామారెడ్డి :
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని కోటిలింగేశ్వర నగర్ కల్కి 4వ వీధి అధ్వాన్న పరిస్థితులలో ఉందని నూతనంగా ఎన్నికైన కాలనీ అధ్యక్షుడు డాక్టర్ బట్టు విఠల్ ముదిరాజ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం జరిగిన కాలనీ సమావేశంలో ఆయన ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ— “కాలనీ లో రోడ్లు లేవు, వీధి లైట్లు లేవు, మురికికాల్వలు లేవు. మట్టిరోడ్లు, ముళ్ల పొదలతో కాలనీ బీభత్సంగా మారింది. ప్రతి ఇంటి నుంచి పన్నులు వసూలు చేస్తూ, మున్సిపాలిటీ అధికారులు కనీసం పనులు చేయడం లేదు. మురికితో నిండిపోవడంతో పాములు, తేళ్లు, విషపురుగులు, కుక్కలు, దోమలు, ఈగలతో కాలనీవాసులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు” అని ఆయన వాపోయారు.స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి, ప్రభుత్వ విప్ షబీర్ అలీ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. “సమస్యలు పరిష్కరించకుంటే మహిళలు, పిల్లలతో కలిసి ప్రత్యక్ష చర్యలకు దిగుతాం. ప్రభుత్వానికి గుణపాఠం చెబుతాం”అనికాలనీవాసులుహెచ్చరించారు.
కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నికలు
కోటిలింగేశ్వర నగర్ కాలనీ సంఘానికి డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ అధ్యక్షుడిగా, సతీష్ కుమార్ ఉపాధ్యక్షుడిగా, సామిరెడ్డి ప్రధాన కార్యదర్శిగా, నారాయణరావు కోశాధికారిగా, నర్సింలు సహాయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభ్యులుగా చంద్రం ముదిరాజ్, సురేందర్ రెడ్డి, కషగౌడ్, సంజీవరెడ్డి, ఆంజనేయులు, కోఆర్డినేటర్‌గా రాజేందర్ , రాజులు తదితరులు ఎంపికయ్యారు.