*బీ.ఆర్.ఎస్ పార్టీ శాసనసభ విప్ గా కేపీ వివేకానంద్*
*ప్రశ్న ఆయుధం ఫిబ్రవరి 04:కుత్బుల్లాపూర్ ప్రతినిధి*
తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ విప్‌గా తనను ప్రకటించిన సందర్భంగా ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ పార్టీ అధినేత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ… నాపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ అధినేత కేసీఆర్ కి, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.
ఈ బాధ్యతను పూర్తి నిబద్ధతతో పార్టీ ఆదేశాలను పాటిస్తూ.. శాసనసభలో పార్టీ ప్రతిష్టను మరింత పెంచేలా పని చేస్తాను అని పేర్కొన్నారు.
అలాగే పార్టీ నాయకత్వం తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని పార్టీ అభివృద్ధికి ప్రజల ఆకాంక్షల నెరవేర్చేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.