క్రాంతి కో – ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ బ్రాంచ్ ప్రారంభం
బీఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి
వనస్థలిపురం , అక్టోబర్ 23: ( ప్రశ్న ఆయుధం) బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలో సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీలో నూతన క్రాంతి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ బ్రాంచ్ ను బిఎన్ రెడ్డి నగర్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కొత్త బ్రాంచ్ ను గురువారము ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ బ్యాంకులకు ధీటుగా సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ చైర్మన్ బాలయ్య, వైస్ చైర్మన్ రాజేశ్వరరావు, డైరెక్టర్లు యాదయ్య, మురళీకృష్ణ, శ్రీనివాస్ రాజు, అశ్వ, శైలజ, నాగేశ్వరరావు, రమేష్ కుమార్, పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రావు, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్ రావు, బీజేవైఎం అధ్యక్షులు సురేష్ కుమార్, డివిజన్ ఈసీ మెంబర్ ప్రభాకర్, ఎస్ కే డి నగర్ గౌరవ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కన్వీనర్ వెంకటేశ్వరరావు, ఎస్ కే డి నగర్ కాలనీ ఉపాధ్యక్షులు కమతం వెంకటరమణ, నరసింహారెడ్డి, హనుమాన్ తదితరులు పాల్గొన్నారు.