క్రీడాకారినీ కి క్రీడాజ్యోతి స్పోర్ట్స్ ఫౌండేషన్ చేయూత

క్రీడాకారికి క్రీడాజ్యోతి స్పోర్ట్స్ ఫౌండేషన్ చేయూత

గజ్వేల్ ఆగస్టు 31 ప్రశ్న ఆయుధం :

జాతీయ క్రీడాకారిణి అంజలి ఇటీవల పిఈసెట్ ఎంట్రెన్స్ రాష్ట్రస్థాయిలో 29వ ర్యాంకు సాధించి తను వ్యాయామ విద్య కోర్సు చేయడానికి గల ఆర్థిక ఇబ్బందులను గ్రహించిన క్రీడాజ్యోతి స్పోర్ట్స్ ఫొండేషన్ సభ్యులు అంజలి యొక్క వ్యాయామ విద్య కోర్సుకు అవసరమగు ఆర్ధిక సహాయాన్ని 5 వేల రూపాయలు అందించారు. ఆదేవిధంగా రెండు సంవత్సరల కోర్సు పూర్తి చేయడానికి అవసరం అగు ఆర్థిక సహాయాన్ని కూడా ఫౌండేషన్ సమకూరుస్తుందని తెలిపారు. అందించిన వారిలో క్రీడాజ్యోతి స్పోర్ట్స్ ఫౌండేషన్ చైర్మన్ ఎం.ఎస్.కే .హైదర్ పటేల్, ఉపాధ్యక్షురాలు ఎన్.విజయరేఖ , ఫౌండేషన్ సభ్యులు ఎన్.గోవర్ధన్ రెడ్డి ,కె.జయపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now