Site icon PRASHNA AYUDHAM

మెడికల్ కళాశాలలో క్రీడా మైదానం ఏర్పాటు కు కృషి: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

IMG 20251014 180140

Oplus_131072

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 14 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో క్రీడా మైదానం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశించారు. కళాశాల ప్రాంగణంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన క్రీడా మైదానం (స్పోర్ట్స్ గ్రౌండ్) ఏర్పాటు కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ శాఖ అధికారులకు సూచించారు. మంగళవారం సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రాంగణంలో పర్యటించారు. ఆర్ అండ్ బీ (రోడ్స్ అండ్ బిల్డింగ్స్) ఇంజనీరింగ్ అధికారులు, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి (డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ) జిజిహెచ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి కళాశాల ప్రాంగణంలో స్పోర్ట్స్ గ్రౌండ్ ఏర్పాటుకు కొరకు అవసరమైన స్థలం సర్దుబాటు మార్గాలపై సమీక్షించారు. కళాశాల విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించేలా ప్రోత్సహించేందుకు ఆధునిక సౌకర్యాలతో కూడిన క్రీడా మైదానం ఏర్పాటు చేయడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటు క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక వికాసం, పెంపొందుతుందని తెలిపారు. మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న క్రీడా ప్రాంగణంలో క్రికెట్ ప్రాక్టీసింగ్ నెట్ కోర్టులు, వాలీబాల్ కోర్ట్, త్రోబాల్ కోర్టు, బాస్కెట్‌బాల్ కోర్ట్ బ్యాడ్మింటన్, వంటి క్రీడలకు అనువైన మల్టీపర్పస్ ప్లే గ్రౌండ్ రూపకల్పన చేయాలని జిల్లా క్రీడా అధికారి ఖాసీం భేగ్ కు సూచించార. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నర్సింలు, రవికుమార్, జిజిహెచ్ ఈఈ శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version