జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలలో పాల్గొని కాంస్య పతకం సాధించిన క్రిష్ణ కిషోర్ కు
ప్రశ్న ఆయుధం జనవరి 16: శేరి లింగంపల్లి ప్రతినిధి
జనవరి 10,11,12 తేదీలలో పుదుచ్చేరి, పాండిచ్చేరి లో జరిగిన జాతీయ సౌత్ జోన్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో అండర్ -14 తెలంగాణ రాష్ట్రము తరపున పాల్గొని బ్రానజ్ సాధించిన మియాపూర్ చెందిన పొన్నకంటి దస్తగిరి, కవిత దంపతుల కుమారుడు కృష్ణ కిషోర్ ను యంసిపిఐ (యు )పార్టీ ఆధ్వర్యంలో తాండ్ర రామచంద్ర భవన్ యం ఎ నగర్ లో ప్రజా సంఘాల నాయకులు కలిసి ఘనంగా సన్మానం చేసారు.ఇలాంటి మరెన్నో పతకాలు సాధించి ఉన్నంత స్థాయికి ఎదగాలని అభినందించారు. ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలో పాల్గొని కాంస్య పతకం సాధించిన క్రిష్ణ కిషోర్ లాంటి అట్టడుగు వర్గాల ఆణిముత్యాలను ప్రభుత్వం ఆర్థిక పరమైన వెసులుబాటును కల్పించాలని ప్రభుత్వం అట్టడుగు వర్గాల పిల్లలను దృష్టిలో పెట్టుకొని మెరుగైన శిక్షణ ఇచ్చి ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు
ఈ కార్యక్రమంలో ఎ ఐ ఎఫ్ డి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు పల్లె మురళి,యం సీపీఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్,కార్యదర్శి వర్గ సభ్యులు ఇస్లావత్ దశరథ్ నాయక్,ఎ ఐ ఎఫ్ డి డబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు అంగడి పుష్ప,, ఎ ఐ సి టీ యు గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి కర్ర దానయ్య, ఆకుల రమేష్ శివాని,ఎ ఐ ఎఫ్ డి వై నాయకులు ,యం డి సుల్తానా బేగం,విద్యార్థి సంఘం నాయకులు శ్రీకాంత్, అరుణ్,రాజేంద్ర,వంశి, తదితరులు పాల్గొన్నారు