బిఎస్ఎన్ఎల్ కస్టమర్ల సమస్యలను పరిష్కరిస్తాం:- కృష్ణ సాయి, డీజీఎం, వేస్ట్ జోన్.
ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 16: కూకట్‌పల్లి ప్రతినిధి
భారత్ సంచార్ నిగం లిమిటెడ్ కస్టమర్ల సమస్యలను పరిష్కరించామని డిప్యూటీ జనరల్ మేనేజర్ కృష్ణ సాయి వేస్ట్ జోన్ తెలిపారు. బుధవారం కూకట్పల్లి నియోజకవర్గం కెపిహెచ్బి కాలనీ డివిజన్ ప్రాంతంలోని భారత్ సంచార్ నిగం లిమిటెడ్ టెలికాం ఎక్స్చేంజ్ ప్రాంతంలో కస్టమర్ సర్వీస్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ వాడుతున్న కస్టమర్ల సమస్యలు తెలుసుకొని పరిష్కరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బాబురావు, ఎంప్టీ సురేష్ కుమార్, ఎఫ్ఎం & జూనియర్ టెలికాం ఆఫీసర్ ప్రశాంత్ బాబు, బిబిఎం & జూనియర్ టెలికాం ఆఫీసర్ పాండురంగ విట్టల్, కేఏఎం & జూనియర్ టెలికాం ఆఫీసర్ శ్రీధర్ రామ, జూనియర్ టెలికామ్ ఆఫీసర్ పద్మలత, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శైలజ, టీ ఐ పి తోపాటు తదితరులు పాల్గొన్నారు.