సంగారెడ్డి, ఆగస్టు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి బైపాస్ లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి పురస్కరించుకొని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ వాసవి క్లబ్ సంగారెడ్డి అధ్యక్షుడు చంద్రిక కరుణాకర్ హాజరై మాట్లాడుతూ.. శ్రీకృష్ణ అష్టమి అంటే గీతా ప్రదేశం శ్రీకృష్ణుడు చేసిన ధర్మ మార్గాన్ని అనుసరించి ప్రతి ఒక్కరు ధర్మాన్ని పాటించి ధర్మస్థాపనకు శ్రీకృష్ణుడు చేసిన మహాభారత యుద్ధాన్ని ధర్మ సంస్థాపనకై అఖండ భూ ప్రపంచానికి దారి చూపిన శ్రీకృష్ణుని వేడుకలు జరుపుకోవడం ఎంతో గర్వకారమని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు చిన్ని కృష్ణ, గోపికలు కోలాటం, ఉట్టి కొట్టడం అందరికీ కనువిందు చేశాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు, కిరణ్ పాఠశాల ఆచార్యులు, వరలక్ష్మి, సద్గుణ, రమ్య, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు
Oplus_131072