సెయింట్ మేరీ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు
గజ్వేల్,ఆగస్టు 24 ప్రశ్న ఆయుధం :
ప్రజ్ఞాపూర్ లోని సెయింట్ మేరీ పాఠశాలలో శనివారం ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గోపికలు కృష్ణులుగా వేషాలు వేసి నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ విజయపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.