*ఆలయ ఫౌండేషన్ సౌజన్యంతో వికలాంగునికి కృత్తిమ జైపూర్ ఫుట్*
*ఆలయ ఫౌండేషన్ కోఆర్డినేటర్ గాదె గుణసాగర్*
*జమ్మికుంట మార్చి 25 ప్రశ్న ఆయుధం*
ప్రమాదవశాత్తు తన కుడికాలు విరిగిపోవడంతో వికలాంగుడిగా మారిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిదిలో అంబేద్కర్ నగర్ చెందిన వడ్లూరి పోచయ్య అనే కార్మికుడికి ఆలయ ఫౌండేషన్ సహకారంతో కృత్తిమ జైపూర్ ఫుట్ అందించారు ప్రమాదవశాత్తు తన కుడికాలు కోల్పోయి బాధపడుతుండగా మండలంలో ఆ నోట ఈ నోట ఆలయఫౌండేషన్ కో ఆర్డినేటర్ గాదె గుణసాగర్ నేత ను సంప్రదించగా ఆలయఫౌండేషన్ మార్గదర్శకులు పరికిపండ్ల నరహరి ఐఏఎస్ అధికారి చొరవతో శ్రీ భగవాన్ మహవీర్ ట్రస్ట్ హైదరాబాద్ వారి సౌజన్యంతో కాలును కోల్పోయిన కార్మికుడు వడ్డూరి పోచయ్య కు జైపూర్ ఫుట్ ను అందించారు
గత పది సంవత్సరాలుగా ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ వరంగల్ జిల్లాలో విద్యా వైద్యం ఉపాధి కార్యక్రమాలను ఎన్నో చేస్తున్నారు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వుండి జన్మభూమి పై మమకారంతో సేవ చేయడం సంతోషంగా ఉందని పరికి పండ్ల నరహరి ఐఏఎస్ అన్నారు ప్రతి ఒక్కరు సేవా భావము కలిగి ఉండాలని తెలిపారు