Site icon PRASHNA AYUDHAM

ఆత్మను సూచించేదే క్షేత్ర జ్ఞానము*

IMG 20251220 WA0364

*ఆత్మను సూచించేదే క్షేత్ర జ్ఞానము*

 

*13వ అధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ యోగ పారాయణం*

 

*5 యజ్ఞ కుండళ్ళలో గాయత్రీ, మృత్యుంజయ మహా యజ్ఞం*

 

*ఆర్మూర్ (ప్రశ్న ఆయుధం) ఆర్ సి*

 

ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలోని వైదిక ధ్యాన యోగ ఆశ్రమం అంకాపూర్లో శ్రీమద్ భగవద్గీత పారాయణంలో భాగంగా ఆదివారం 13వ అధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ యోగ పారాయణం చేశారని సత్కార్యాల కార్యకర్త, ప్రముఖ కవి కంకణాల రాజేశ్వర్ మీడియాతో తెలిపారు. పారాయణం, యజ్ఞానానంతరం స్వామీజీలు సత్సంగం చేశారు. శ్రీధరానంద భారతి స్వామి, వేద పునీతానంద భారతి స్వామి ఆధ్యాత్మికంగా ప్రసంగిస్తూ భౌతిక శరీరాన్ని, భౌతిక ప్రపంచాన్ని సూచించేదే క్షేత్రం. క్షేత్రాన్ని తెలిసినవాడు అనేది ఆత్మను సూచిస్తుంది. ఆధ్యాత్మికాభివృద్ధికి భక్తి, జ్ఞానం రెండూ అవసరమే. భక్తి దైవిక ప్రేమకు, శరణాగతికి దారితీస్తుంది. జ్ఞానం వాస్తవికత యొక్క నిజమైన స్వభావాన్ని ఆవిష్కరిస్తుంది. రెండు మార్గాలు చివరికి స్వీయ సాక్షాత్కారానికి దారితీస్తాయి. జ్ఞానానికి దారి చూపుతూ అన్వేషకులను జ్ఞానం మరియు స్వీయ సాక్షాత్కార మార్గంలో మార్గ నిర్దేశం చేస్తుంది. శరీరం మరియు ఆత్మ మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం ద్వారా క్షేత్ర లక్షణాలను గుర్తించడం, అంతిమ వాస్తవికతను గ్రహించడం ద్వారా వ్యక్తులు నిజమైన జ్ఞానాన్ని పొందవచ్చు. మరియు ముక్తిని పొందవచ్చు. జ్ఞానం అనేది అంతర్గత పరివర్తనకు శక్తివంతమైన సాధనం. క్షేత్రం అంటే భూమి లేక పొలము. పొలంలో నాటిన బీజాలు అభివృద్ధి చెందడానికి భూమి ఎంత సహాయకారియో, అదేవిధంగా జ్ఞానం అనే బీజము అభివృద్ధి చెందడానికి శరీరం కూడా అంతే సహాయకారి.అంటే జ్ఞానబీజమునకు శరీరము క్షేత్రము లాగా సహకరిస్తుంది. కనుక శరీరమే క్షేత్రమని చెప్పబడింది. ఆత్మను సూచించేదే క్షేత్ర జ్ఞానము అని అన్నారు. ఈ మహత్కార్యములో సతీష్ ఆర్య (మంచిర్యాల్), గంగారెడ్డి దంపతులు (కలిగోట్),

పత్తిగారి అరుణ ప్రభాకర్ (సంగారెడ్డి) కరీంనగర్, నిజామాబాద్, ఆర్మూర్, అంకాపూర్ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.

Exit mobile version