బాన్సువాడ లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

బాన్సువాడ లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

ప్రశ్న ఆయుధం 24 జూలై ( బాన్సువాడ ప్రతినిధి)

బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా లో మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్బంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ మొక్కలు పంపిణీ చేసి,కేక్ కట్ చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…మాజీ ఐటీ శాఖ మంత్రి హైదరాబాద్ ను ప్రపంచ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి కేటీఆర్ అనీ అన్నారు.ఈ సందర్బంగా కేటీఆర్ కు నాయకులు కార్యకర్తలు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.కేటీఆర్ నిండు నూరేండ్లు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో మోచీ గణేష్,యూత్ నాయకులు శివసూరీ,ఎర్రవటి సాయిబాబారమేష్ యాదవ్,మౌలా,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment