*రేవంత్ చిన్న చిట్‌చాట్‌కు కేటీఆర్ గంటన్నర వివరణ !*
రాజకీయాలంటే విచిత్రంగా ఉంటాయి. ఎవరు ఎవరి ట్రాప్ లో పడుతున్నారో అర్థం కాదు. కానీ అతి గా స్పందిస్దే మాత్రం వారే ఇరుక్కుపోయినట్లు అవుతుంది. ఈ అంశంలో కేటీఆర్ తొందరపాటు తనాన్ని సీఎం రేవంత్ రెడ్డి పక్కాగా ఉపయోగించుకుంటున్నారు. చిట్ చాట్‌ల పేరుతో మీడియా ప్రతినిధులతో కేటీఆర్ పై కామెంట్లు చేసి రెచ్చగొడుతున్నారు. కేటీఆర్ వెంటనే రంగంలోకి దిగుతున్నారు. ఆయనకు అర్థం కాని విషయం ఏమిటంటే.. ఈ చిట్ చాట్‌లు పూర్తిగా ఆఫ్ ది రికార్డు అసలు రేవంత్ ఆ మాటలన్నారని ఎవరూ నిరూపించలేరు.
ఈ విషయం కేటీఆర్ కూ తెలుసు. ఎందుకంటే ఈ చిట్ చాట్‌లలో కేటీఆర్ కూడా ఎక్స్ పర్టే. అయినా రేవంత్ మాటలపై ఎందుకు ఉలికి పడుతున్నారో కేటీఆర్‌కే తెలియాలి. చిట్ చాట్ లో తనపై డ్రగ్స్ ఆరోపణలు చేశారని కోర్టుకు లాగుతానని ట్వీట్ చేశారు. శుక్రవారం ప్రెస్ మీట్ పెట్టి గంటన్నర సేపు రేవంత్ చిట్ చాట్ పై తనదైన వివరణ ఇచ్చారు. అందులో సవాళ్లు ఉన్నా.. రేవంత్ మాట్లాడారని మీడియాలో ప్రచారం జరిగిన అంశాలన్నింటికీ వివరణలు ఉన్నాయి.
లోకేష్ తో భేటీ ఇందులో ప్రదానమైనది. తాను లోకేష్ తో భేటీ కాలేదని చెప్పారు. కానీ లోకేష్ తనకు సోదరుడి లాంటి వార